‘వెంకీమామ’ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యా – సురేష్ బాబు

Tuesday,December 10,2019 - 05:27 by Z_CLU

ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది వెంకీమామ. సినిమా డిసెంబర్ 13 న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకునే విషయంలో చాలా జాప్యం చేశారు నిర్మాత సురేష్ బాబు. అ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో రివీల్ చేశారు.

నిజానికి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి ఎక్కువగా విదేశాల్లోనే ఉన్నారు సురేష్ బాబు. దానికి తోడు సరిగ్గా ‘కోకాకోలా పెప్సీ…’ సాంగ్ షూట్ సమయానికి వెంకీ కాలు బెణకడంతో కొన్నాళ్ళు షూటింగ్ ఆగిపోయింది. ఆ కారణాల షూటింగ్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో కనీసం ప్లానింగ్ కూడా చేసుకోలేక కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పుకున్నారు నిర్మాత సురేష్ బాబు.

‘తీరా సినిమా కంప్లీట్ అయ్యే నాటికి పండక్కి సరిపడా సినిమాలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి. దాంతో ఏ సినిమాతోనూ క్లాష్ పెట్టుకోవడం ఇష్టం లేక ఏ డేట్ ఫిక్స్ చేసుకుంటే సరిపడా థియేటర్స్ దొరకుతాయి అనే ఆంగిల్ లో ఆలోచించి చివరికి డిసెంబర్ 13 ని ఫిక్స్ అయ్యా…’ అని చెప్పుకున్నారు.

అందునా ఈ సీనియర్ ప్రొడ్యూసర్ ‘వెంకీమామ’ విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే సంక్రాంతికి ఈ సినిమా థియేటర్స్ లోకి రావట్లేదు అనే ఫీలింగ్ అస్సలు లేదు. డిసెంబర్ మధ్యలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అటు క్రిస్మస్ కి కూడా ఆడేసి, సంక్రాంతి వరకు డెఫ్ఫినెట్ గా నిలుస్తుందని అన్నారు.