విక్రమ్ వేధపై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

Tuesday,May 07,2019 - 12:40 by Z_CLU

కోలీవుడ్ లో హిట్ అయినప్పట్నుంచి ఈ సినిమా రీమేక్ పై తెలుగులో పుకార్లు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మల్టీస్టారర్ కావడంతో, అలాంటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వెంకటేశ్, ఇందులో కచ్చితంగా నటించబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఈ రూమర్లకు సురేష్ బాబు చెక్ పెట్టారు.

విక్రమ్ వేధ తెలుగు రీమేక్ లో వెంకీ హీరోగా నటించబోతున్నాడంటూ మీడియా వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం వెంకీ మామ సినిమా మాత్రమే చేస్తున్నాడు. తర్వాత సినిమా ఏంటనేది త్వరలోనే వెల్లడిస్తాం.

ఇలా విక్రమ్ వేధ రీమేక్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు నిర్మాత సురేష్ బాబు. రీసెంట్ గా ఈ సినిమాలో నారా రోహిత్ కూడా నటించబోతున్నట్టు గాసిప్స్ వచ్చాయి. మాధవన్ పాత్రలో వెంకీ, విజయ్ సేతుపతి క్యారెక్టర్ లో నారా రోహిత్ నటించబోతున్నారనే మేటర్ ట్రెండ్ అయింది. అందుకే సురేష్ బాబు ఇలా ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.