సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ ....

Friday,December 16,2016 - 09:30 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో అఖిల్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ పెళ్లి తో సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టిన ఈ అక్కినేని హీరో తన పెళ్లి తరువాత వరుస పెట్టి సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు.

   ప్రెజెంట్ ‘మనం’, ’24’ ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సెకండ్ ఫిలిం చేయడానికి రెడీ అవుతున్న అఖిల్ మరో వైపు తన థర్డ్ ఫిలిం ను కూడా ఓ స్టార్ డైరెక్టర్ తో ప్లాన్ చేసుకున్నాడట. లేటెస్ట్ గా ‘ధృవ’ తో గ్రాండ్ హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నా డట సిసింద్రీ. ఇప్పటికే అఖిల్ కోసం ఓ మాస్ ఎంటర్టైనర్ స్టోరీ కూడా రెడీ చేసి లేటెస్ట్ గా వినిపించాడట సురేందర్ రెడ్డి. ఈ స్టోరీ అఖిల్ తో పాటు అక్కినేని ఫామిలీకీ కూడా బాగా నచ్చడం తో సురేందర్ రెడ్డి తోనే థర్డ్ ఫిలిం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట అఖిల్. ఇటీవలే చిరంజీవి తో ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సురేందర్ రెడ్డి ఆ సినిమాకు ఇంకా టైం ఉండడం తో ప్రెజెంట్ అఖిల్ సినిమా పై ఫోకస్ పెట్టి వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడని సమాచారం.

akhil-wtp