సురేందర్ రెడ్డికి దారేది?

Friday,October 11,2019 - 02:12 by Z_CLU

సైరా సినిమాతో హీరోల హాట్ ఫేవరెట్ అయిపోయాడు సురేందర్ రెడ్డి. ఏకంగా చిరంజీవిని హీరోగా పెట్టి సైరా లాంటి భారీ బడ్జెట్ సినిమాను తీయడంతో.. చాలామంది స్టార్ హీరోలు ఇప్పుడు సురేందర్ రెడ్డిని బెస్ట్ ఆప్షన్ గా చూస్తున్నారు. మొన్నటివరకు రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, బోయపాటి లాంటి హీరోలు మాత్రం భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ గా నిలవగా, ఇప్పుడీ లిస్ట్ లోకి సురేందర్ కూడా చేరిపోయాడు.

మరీ ముఖ్యంగా పాన్-ఇండియా సినిమా తీయాలంటే సురేందర్ రెడ్డి బెస్ట్ ఆప్షన్ గా మారాడు. తెలుగు రాష్ట్రాల్లో సైరా సూపర్ సక్సెస్ అవ్వడంతో సురేందర్ కు ఫ్యాన్స్ ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా నితిన్ తో అతడు సినిమా చేయబోతున్నాడంటూ 3 రోజుల కిందట ఓ గాసిప్ బయల్దేరింది. ఇప్పుడీ గాసిప్ లిస్ట్ లోకి ప్రభాస్ కూడా చేరాడు.

ప్రభాస్ తో జేమ్స్ బాండ్ తరహా మూవీ చేస్తే బాగుంటుందంటూ సురేందర్ రెడ్డికి చాలామంది సలహాలు ఇస్తున్నారు. అటు సురేందర్ రెడ్డి మంచి కాన్సెప్ట్ తో వస్తే సినిమా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫీలర్లు వస్తున్నాయి.

ప్రస్తుతానికైతే సురేందర్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అతడింకా సైరా మేనియా నుంచి బయటకు రాలేదు. కొన్నాళ్లు రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత నెక్ట్స్ మూవీ గురించి ఆలోచిస్తాడు.