సురేందర్ రెడ్డి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Tuesday,December 06,2016 - 03:45 by Z_CLU

‘అతనొక్కడే’ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమై తక్కువ సినిమాలతోనే దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి లేటెస్ట్ సినిమా ‘ధృవ’ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా సురేందర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.

*ఇదే నా చివరి సినిమా..

దర్శకుడిగా ఓ కథ తో సినిమా చెయ్యడం కాస్త సులువే. మనం అనుకున్నది అనుకున్నట్టు చేస్తూ వెళ్లొచ్చు. కానీ రీమేక్ విషయంలో అలా చేయడానికి ఉండదు. ఒక పరిధిలో ఆ సినిమాను తెరకెక్కించాలి. నా విషయానికొస్తే రీమేక్ చాలా కష్టమనిపించింది. కొన్ని రీమేక్ కథలకు ఎలాంటి మార్పులు చేయలేం. తేడా వస్తే అంతే సంగతులు. అందుకే ‘ధృవ’ తర్వాత మరో రీమేక్ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఈ విషయంలో ఇదే నా చివరి సినిమా.

surender-reddy-2
*నెక్స్ట్ మెగాస్టార్ తో…

ప్రస్తుతం ‘ధృవ రిలీజ్ గురించి ఎదురుచూస్తున్నా. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేస్తా. ఆయనతో కాస్త కిక్ ఫ్లేవర్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని ఉంది. ప్రెజెంట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. బహుశా వచ్చే ఏడాది ఆయనతో సినిమా ఉంటుంది.

*అందుకే ‘ధృవ’ ను డైరెక్ట్ చేశా…

కిక్ 2 తర్వాత రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయ్యాను. అయితే చెర్రీ తో ఎలాంటి కథ చేయాలా అని ఆలోచిస్తుండగా చరణ్ ‘తని ఒరువన్’ సినిమా చూడమని చెప్పి ఈ సినిమా చేయబోతున్నాం అన్నారు. సినిమా చూసాక నాకు కూడా బాగా నచ్చి ఈ రీమేక్ హ్యాండిల్ చేశాను.

surendereddy-3
* ఆ విషయంలో చరణ్ సూపర్..

రామ్ చరణ్ బయట చాలా ఇమేజ్ ఉన్న హీరో అయినప్పటికీ సెట్స్ పై మాత్రం చాలా సింపుల్ గా ఉంటూ డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేసే హీరో. నిజంగా ఆ విషయంలో చెర్రీ సూపర్. ఈ సినిమా గురించి చెర్రీ కష్టం చూసి షాక్ అయ్యాను. ఒరిజినల్ సినిమా చూడగానే తన ఫిజిక్ పై దృష్టి పెట్టాలని మెంటల్ గా ఫిక్స్ అయి చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ చేశారు. సిక్స్ ప్యాక్ చేయడం ఒకెత్తయితే షూటింగ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ అలానే మెయింటైన్ చేయడం మరో ఎత్తు. రీమేక్ సినిమా అయినప్పటికీ చెర్రీ ఓ స్ట్రయిట్ సినిమా కంటే ఎక్కువే కష్టపడ్డాడు..

*ఇక్కడా అంతే..

రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ లో ఎలాంటి ప్రత్యేకత లేదు. ఒరిజినల్ క్యారెక్టర్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ తన గ్లామర్ తో సినిమాకు ప్లస్ అయింది రకుల్.

surender-reddy-1

*అదొక్కటే ట్రై చేసాం..

చాలా స్ట్రాంగ్ కంటెంట్ కావడంతో రీమేక్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ ఒరిజినల్ సినిమాతో పోలిస్తే… ‘ధృవ’ లో ఒక సాంగ్ ఎక్స్ ట్రా ఉంటుంది. ఆ సాంగ్ తప్ప సినిమాలో ఏదీ ఎక్స్ ట్రా కనిపించదు. కొన్ని రీమేక్ సినిమాలకు మార్పులు చేయలేం. వాటిని యాజ్ ఇటీజ్ గా తీయాల్సిందే.

* అందుకే ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నాడు..

ముందుగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా అసీం మిష్రాను తీసుకున్నాం. కానీ అప్పటికే ఆయన సల్మాన్ ఖాన్ సినిమా కు కమిట్ అయ్యారు. కానీ మా సినిమా షూట్ అయిపోయాకే ఆ సినిమా స్టార్ట్ అవ్వాలి కానీ సల్మాన్ సినిమా షూట్ ధృవ మధ్యలోనే స్టార్ట్ అవుతుందని తెలిసి… అసీం డ్రాప్ అయ్యారు. సినిమా ఎండింగ్ వరకూ ఒకే సినిమాటోగ్రాఫర్ ఉంటే బాగుంటుందని సజెస్ట్ చేశారు. ఆయన చెప్పింది కూడా నిజమే కదా అని బాగా ఆలోచించే ఆయన ప్లేస్ లో పి.ఎస్.వినోద్ ను తీసుకున్నాం.

*అది నా ఛాయిస్ ..

ఒరిజినల్ సినిమాకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ హిపాప్ తమీజా అయితే ఈ సినిమాకు మ్యూజిక్ పర్ఫెక్ట్ గా అందించగలడని నేనే తమీజాను సెలక్ట్ చేశాను. చెర్రీ కూడా వెంటనే ఓకే అన్నారు. కొత్త వాళ్ళతో కొత్తగా ఉంటుందని ఫీలయ్యి అందరం కలిసి ఆ నిర్ణయం తీసుకున్నాం.