దిల్ రాజును సన్మానించిన సుప్రీమ్ హీరో

Monday,April 10,2017 - 02:08 by Z_CLU

శతమానం భవతి నేషనల్ అవార్డు గెలుచుకున్న సందర్భంగా ‘సాయి ధరమ్ తేజ్’ దిల్ రాజును ప్రత్యేకంగా సన్మానించాడు. ప్రస్తుతం B.V.S. రవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘జవాన్’ సెట్స్ పై ఉన్న సాయి ధరం తేజ్ తన యూనిట్ సమక్షంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ ని ప్రత్యేకంగా అభినందించాడు.

సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలతో పాటు బరిలోకి దిగిన శతమానం భవతి రిలీజై నాలుగు నెలలు కావస్తున్నా, ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంది. ఈ సినిమా సంబరాలు రిలీజైన కొత్తలో పాజిటివ్ టాక్ తో బిగిన్ అయితే నేషనల్ అవార్డ్ ని దక్కించుకునే వరకు పాజిటివ్ గా మూవ్ అవుతూనే ఉంది.

టాలీవుడ్లో ఎన్నేసి ట్రెండ్స్ మారినా, ఫ్యామిలీ సినిమాలకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు అని ప్రూఫ్ చేసింది శతమానం భవతి. ఈ సినిమాతో బ్రాండెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పాప్యులర్ ప్రొడ్యూసర్ అయిపోయాడు.