త్రివిక్రమ్ దర్శకత్వం లో మహేష్..

Thursday,September 29,2016 - 05:00 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం ఏంటి? ప్రస్తుతం మహేష్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు కదా.. ఆ సినిమా తరువాత మరో ఇద్దరు-ముగ్గురు దర్శకులతో మహేష్ కమిట్ అయ్యాడు కదా… మళ్ళీ సడెన్ గా త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడమేంటి? అనుకుంటున్నారా? కాని ఇది నిజమే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.

   siv_63320030

     ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మూడో సినిమాకు పనిచేయాలనుకున్నారు ఈ ఇద్దరు. కానీ దానికి ఇంకా చాలా టైం ఉంది.  ‘అ ఆ’ విజయం తరువాత త్రివిక్రమ్ మరో సినిమాను ప్రారంభించలేదు. ఇందుకు కారణం మాటల మాంత్రికుడు ప్రస్తుతం పవన్ పై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా కోసం కథను కూడా సిద్దం చేసుకున్నాడు. కాని ఈ షార్ట్ గ్యాప్ లోనే మహేష్-త్రివిక్రమ్ కలిశారు. ఓ యాడ్ ఫిలిం కోసం ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వచ్చారు. ఈ యాడ్ షూటింగ్  ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. సో… ఇలా మహేష్-త్రివిక్రమ్ మరోసారి కలిశారన్నమాట.