కమర్షియల్ హంగులతో పాటు సందేశం కూడా ఉంది -రజిని కాంత్

Tuesday,June 05,2018 - 10:34 by Z_CLU

‘కాలా’ సినిమా ప్రమోషన్ లో భాగంగా  హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు సూపర్ స్టార్ రజిని కాంత్. అల్లుడు ధనుష్ , దర్శకుడు రంజిత్, ఈశ్వరి ప్రసాద్, హుమా ఖురేషి చిత్ర బృందంతో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు రజిని.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజిని కాంత్ మాట్లాడుతూ ” నా మొదటి తెలుగు సినిమా ‘అంతులేని కథ’ 1978 లో రిలీజ్ అయింది..ఆ సినిమా తర్వాత తెలుగులో వరుసగా దాదాపు 15 సినిమాలు చేసాను. ఆ తర్వాత  తెలుగులో కాస్త బ్రేక్ వచ్చింది. ఆ సమయంలో తెలుగులో కంటిన్యూ అవ్వాలా…లేదా తమిళ్ లో సినిమాలు చేయాలా….అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా.. అప్పుడు నా కెరీర్ స్టార్ట్ చేసిన తమిళ్ పరిశ్రమను ఎంచుకోవడం వల్ల… తెలుగులో మళ్ళీ సినిమా చేయలేకపోయాను. మళ్ళీ మోహన్ బాబు ‘పెదరాయుడు’ సినిమాతో తెలుగులో నాకు బ్రేక్ ఇచ్చాడు. ఆతర్వాత నా ‘నరసింహ’,’ముత్తు’,’అరుణాచలం’, ‘శివాజీ’, ‘రోబో’,’కబాలి’ సినిమాలు ఇక్కడ కూడా విడుదలయ్యాయి. రంజిత్ గారితో కబాలి సినిమా చేసేటప్పుడు ఇండస్ట్రీ లో చర్చ జరిగింది. రజినీకాంత్ ఏంటి…ఒక కొత్త అబ్బాయితో సినిమా చేస్తున్నాడు..అని అందరూ అనుకున్నారు. కాని ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా అతనికి  ఇంప్రెస్ అయిపోయాను. ఆ సినిమాను బాగా తీసాడు. అందుకే ఆయనతో నేను నా అల్లుడు ధనుష్ కలిసి ఈ సినిమా చేసాం. కమర్షియల్ హంగులతో పాటు ఒక మంచి సందేశం ఉన్న సినిమా ఇది. ఒక కమర్షియల్ సినిమాను రియలిస్టిక్ గా తీయడంలో రంజిత్ దిట్ట. ఈ సినిమా చూసాక అది అర్ధమవుతుంది. మన దేశంలోనే అతి పెద్ద స్లం ఒకటి ముంబై లో ఉంది. అక్కడ జరిగే కథే ఇది. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ధనుష్ మంచి నటుడే కాదు మంచి నిర్మాత అని ఈ సినిమాతో రుజువు చేసుకున్నాడు. కచ్చితంగా ఈ సినిమా విజయం సాదిస్తుందని ఆశిస్తున్నా” అన్నారు.