Sarkaru Vaari Paata ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,May 16,2022 - 06:01 by Z_CLU

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Collects

మహేష్ హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. గురువారం రిలీజైన ఈ సినిమా, 4 రోజుల్లో ఏకంగా 95 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఓ రీజనల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఆల్ టైమ్ రికార్డ్ గా చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలి వారాంతం 75 కోట్ల 58 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. విడుదలైన ప్రతి సెంటర్ లో ఈ సినిమాకు వసూళ్లు వచ్చాయి. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. మహేష్ నుంచి ఓ సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి వెళ్లడం ఇది నాలుగో సారి. 2 మిలియన్ డాలర్ క్లబ్ లో నాలుగేసి సినిమాలు కలిగి ఉన్న హీరోలు సౌత్ లో మహేష్ తో పాటు ప్రభాస్, రజనీకాంత్ మాత్రమే.

తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారి పాట సినిమాకు ఫస్ట్ వీకెండ్ వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి..

నైజాం – 29.61Cr
సీడెడ్ – 9.81Cr
ఉత్తరాంధ్ర – 9.36Cr
గుంటూరు – 7.57Cr
ఈస్ట్ – 6.51Cr
కృష్ణా – 5.4Cr
వెస్ట్ – 4.41Cr
నెల్లూరు – 2.91Cr

AP/TG – 75.58Cr
KA+ROI – 7.6Cr
Overseas – 11.9Cr

Total WW Share95.08Cr

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics