జీ తెలుగు సీరియల్ కి మహేష్ ప్రచారం

Wednesday,September 14,2022 - 06:24 by Z_CLU

Superstar Mahesh Babu pramotions for Zee Telugu new Serial

జీ తెలుగు ఛానెల్ లో వచ్చే సీరియల్స్ ఆడియన్స్ ని ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి మరో కొత్త సీరియల్ రాబోతుంది. పడమటి సంధ్యారాగం అనే సరికొత్త సీరియల్ ఈ నెల 19న ప్రారంభం అవ్వబోతుంది. జీ తెలుగులో సెప్టెంబర్ 19 నుండి ప్రతి రోజు రాత్రి 8గంటలకు టెలికాస్ట్ అవ్వనున్న ఈ సీరియల్ కి సూపర్ స్టార్ మహేష్ ప్రచారం చేస్తున్నారు.

“ఇండియాకి అమెరికాకి దూరం వేల మైళ్ళు కావచ్చు కాని రెండిటిని దగ్గర చేసేది.. అనుబంధం మాత్రమే పడమటి సంధ్యారాగం’ మన జీ తెలుగులో” అంటూ సూపర్ స్టార్ మహేష్ తన తనయురాలు సితార తో కలిసి ఈ సీరియల్ థీమ్ , మెయిన్ కేరెక్టర్స్ ను పరిచయం చేస్తూ సూపర్ స్టార్ మహేష్ , సితార ఘట్టమనేని చేసిన ప్రమోషనల్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ పడమటి సంధ్యారాగం సీరియల్ మీద ఆసక్తి పెంచేస్తుంది.


రెక్కలు తొడిగిన ప్రపంచం ఆధ్య సొంతం..
పెనవేసుకుంది ఆమెని ఉమ్మడి బంధం

‘పడమటి సంధ్యారాగం’ సరికొత్త ధారావాహిక సెప్టెంబర్ 19 న ప్రారంభం, సోమ – శని రా|| 8 గం||లకు మీ జీ తెలుగు లో.