బడా హీరోల కామన్ స్పాట్...

Tuesday,October 18,2016 - 02:54 by Z_CLU

చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ సినిమా… రజనీకాంత్ భారీ బడ్జెట్ మూవీ రోబో 2.0 ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ లొకేషన్ పరంగా ఇప్పుడు ఈ రెండు మూవీస్ ఒక్కటయ్యాయి. ఉక్రెయిన్ లోని అందమైన లొకేషన్లలో షూటింగ్ చేయడానికి  అటు చిరంజీవి, ఇటు సూపర్ స్టార్ ఇద్దరూ ప్రిపేర్ అవుతున్నారు.

మెగాస్టార్ 150వ సినిమాను సంథింగ్ స్పెషల్ గా ప్రెజెంట్ చేసేందుకు తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని ప్రదేశాల్ని చూపించాలని మెగా యూనిట్ ఫిక్స్ అయింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ లో షూటింగ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది.

tunnel-of-love-ukraine-2

దర్శకుడు శంకర్ కూడా రోబో 2.0 కోసం ఉక్రెయిన్ బాట పట్టాడు. తన ప్రతి సినిమాలో అద్భుతమైన లొకేషన్లను చూపించేందుకు శంకర్ పరితపిస్తుంటాడు. గతంలో ఐ, అపరిచితుడు, బాయ్స్, జీన్స్ లాంటి సినిమాల్లో ఎన్నో అద్భుతమైన లొకేషన్లు చూపించాడు. ఇప్పుడు రోబో 2.0 కోసం కూడా ఉక్రెయిన్ లో ఓ అద్భుతమైన లొకేషన్ ను ఫిక్స్ చేశాడు. దీని పేరు టన్నెల్ ఆఫ్ లవ్. పచ్చదనంతో నిండిన ఈ ప్రాంతంలో రజనీకాంత్, ఎమీజాక్సన్ ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ తీయాలని ఫిక్స్ అయ్యాడు.