శరవేగంగా 'సూపర్ మచ్చి'

Monday,September 21,2020 - 08:36 by Z_CLU

కల్యాణ్ దేవ్ (Kalyan Dev) హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం క‌ల్యాణ్ దేవ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ల‌పై హైద‌రాబాద్‌లో ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఎస్. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ పాట‌ను కాస‌ర్ల శ్యామ్ రాయ‌గా, ఆనీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూరుస్తున్నారు.

ఇప్ప‌టికే Super Machi టాకీ పార్ట్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం చిత్రీక‌రిస్తున్న పాట‌తో పాటు మ‌రో పాట మాత్ర‌మే చిత్రీక‌రించాల్సి ఉంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ు కూడా జోరుగా సాగుతున్నాయి.

మ్యూజిక్ సెన్సేషన్ Thaman స్వరాలు కూర్చిన ఐదు పాటలు ‘సూపర్ మచ్చి’ సినిమాకు ఎస్సెట్ కానున్నాయి. కన్నడ హీరోయిన్ రచితా రామ్ (Rachita Ram) ఇందులో హీరోయిన్. లవ్ స్టోరీ మిక్స్ చేసిన చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్ గా రాబోతోంది సూపర్ మచ్చి.

తారాగణం:
కల్యాణ్ దేవ్, రచితా రామ్, రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, ‘జబర్దస్త్’ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్

సాంకేతిక బృందం:
మ్యూజిక్: తమన్ ఎస్.
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ కుమార్ మావిళ్ల
నిర్మాతలు: రిజ్వాన్, ఖుషి
దర్శకుడు: పులి వాసు