#BheemlaNayak ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

Wednesday,September 01,2021 - 06:28 by Z_CLU

‘వకీల్ సాబ్’ తో పవర్ స్టార్ మేనియా మళ్లీ మొదలైంది. అప్పటి వరకు పవన్ సినిమా ఊసు ఉద్దాపన లేకుండా వేరే హీరో అభిమానుల హంగామా చూస్తూ వెయిట్ చేసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో హంగామా మొదలుపెట్టారు. పవర్ స్టార్ సినిమా ఫస్ట్ లుక్ నుండే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ అప్ కమింగ్ సినిమా నుండి రాబోతున్న ఫస్ట్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 2 పవర్ స్టార్ జన్మదినం సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 2న 11 : 16 AM కి #BheemlaNayakTitleSong సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్ పై అటు పవన్ అభిమానుల్లో ఇటు మ్యూజిక్ లవర్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ మొదటి సాంగ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి ‘మగువా మగువా’ అంటూ ఎక్కడ విన్నా ఆ పాటనే వినిపించేలా చేశాడు తమన్. ఆ క్లాస్ సాంగ్ తో అందరినీ మెప్పించిన తమన్ ఇప్పుడు ఈ మాస్ టైటిల్ సాంగ్ తో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తుంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మరింత ఎట్రాక్ట్ చేస్తుందని దానికి తమన్ బీట్ ఒక రేంజ్ లో ఉంటుందని ఇన్సైడ్ టాక్.

మరి రేపు ఉదయం నుండి ఈ సాంగ్ తో పవర్ స్టార్ సినిమా ఏ రేంజ్ లో హంగామా చేస్తుందో ఎన్ని వ్యూస్ కొల్లగోడుతుందో చూడాలి. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందిస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics