ఉంగరాల రాంబాబు ట్రయిలర్ లాంచ్

Thursday,June 08,2017 - 11:02 by Z_CLU

సునీల్ నటించిన కొత్త సినిమా ఉంగరాల రాంబాబు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకున్న ఈ సినిమా ట్రయిలర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు. క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకుడు. గతంలో ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సెన్సిబుల్ మూవీస్ తీసిన ఈ దర్శకుడు ఇప్పుడు ట్రాక్ మార్చి, సునీల్ తో కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కించాడు.

సునీల్ కూడా ఈమధ్య కాలంలో పూర్తిస్థాయిలో నటించిన కామెడీ చిత్రం ఇదే. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ కామెడీ ఉంటుందంటున్నారు. ఉంగరాల రాంబాబు సినిమాలో సునీల్ సరసన మియా జార్జ్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈసారి కామెడీ పండించే బాధ్యత కేవలం సునీల్ ది మాత్రమే కాదు. సునీల్ కు సపోర్ట్ గా పోసాని లాంటి సీనియర్ కూడా ఉన్నాడు. వీళ్లతో పాటు వెన్నెల కిషోర్ లాంటి స్టార్ కమెడియన్ కూడా ఉన్నాడు. వీళ్లంతా కలిసి ఉంగరాల రాంబాబు ప్రాజెక్టును మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా మార్చేశారు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.