జూన్ లో ఉంగరాల రాంబాబు

Monday,May 29,2017 - 08:30 by Z_CLU

సునీల్-క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఉంగరాల రాంబాబు సినిమా రిలీజ్ కు రెడీ అయింది. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రీ-రికార్డింగ్ స్టేజ్ లో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ లో ఉంగరాల రాంబాబు సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇంతకుముందు ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి క్రిటిక్స్ మెచ్చే చిత్రాలు తీశాడు దర్శకుడు క్రాంతి మాధవ్. ఈసారి కూడా తన స్టయిల్ లో ఉంగరాల రాంబాబు సినిమాను తెరకెక్కించిన క్రాంతి మాధవ్, అందులో సునీల్ మార్క్ కామెడీని కూడా చొప్పించాడు. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

స్టార్ సినిమాటోగ్రాఫర్ సర్వేష్ మురారి, ఈ సినిమాకు డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వ్యవహరిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణమురళి లాంటి సీనియర్ నటులతో పాటు వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్లు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

ఉంగరాల రాంబాబు మూవీ స్టిల్స్