మళ్ళీ కమెడియన్ గా సునీల్...

Wednesday,September 13,2017 - 06:16 by Z_CLU

అప్పట్లో స్టార్ కమెడియన్ గా దూసుకుపోయిన సునీల్ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే… ప్రస్తుతం ‘ఉంగరాల రాంబాబు’ సినిమాతో ఈ శుక్రవారం థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తున్న సునీల్ త్వరలోనే మళ్ళీ కమెడియన్ గా కనిపించి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడట.

ఇటీవలే ‘ఉంగరాల రాంబాబు’ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీరు ఇక పై హీరోగా కంటిన్యూ చేస్తారా.. లేదా మళ్ళీ కమెడియన్ గా ఎంటర్టైన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా.. అనే ప్రశ్న కు క్లారిటీ ఇచ్చేసాడు సునీల్. ఇక పై హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు కామెడీ రోల్స్ కూడా చేయాలనీ డిసైడ్ అయ్యానని.. త్వరలోనే మళ్ళీ కమెడియన్ గా కామెడీ రోల్స్ లో నటిస్తానని తెలిపాడు. సో సునీల్ మళ్ళీ ఏ సినిమాతో కమెడియన్ గా ఎంటర్టైన్ చేస్తాడో..చూడాలి.