ఆ రీమేక్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్న Sunil ?

Wednesday,December 09,2020 - 06:13 by Z_CLU

Sunil త్వరలోనే మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారబోతున్నాడని మొన్నీ మధ్యే ప్రచారం జరిగింది. ఇప్పుడా వార్త నిజమే అని తెలుస్తుంది. అవును ఎప్పటి నుండో ఒక సినిమాను డైరక్ట్ చేయాలనుకుంటున్న సునీల్ ఎట్టకేలకు తన కోరిక తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు. అయితే సునీల్ డైరెక్ట్ చేయబోయే సినిమా ఒక రీమేక్ అని సమాచారం.

గతేడాది విడుదలైన కన్నడ సినిమా ‘BellBottom’ ను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడట. క్రైం కామెడీ కథతో తెరకెక్కిన ‘బెల్ బాట్టం’ సినిమా 2019 లో  కన్నడ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అందుకే సునీల్ తన డైరెక్షన్ డెబ్యూ కోసం ఈ రీమేక్  ను ఎంచుకున్నాడట. అయితే ఇందులో సునీల్ హీరోగా నటిస్తాడా లేదా మరో హీరోను పెట్టి కేవలం తను డైరెక్షన్ మాత్రమే చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం హీరోగా ‘వేదాంతం రాఘవయ్య’ అనే సినిమాతో పాటు నటుడిగా మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు సునీల్. ఆ కమిట్ మెంట్స్ మధ్యలో ఈ రీమేక్ ను హ్యాండిల్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. త్వరలోనే ఈ రీమేక్ గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.