అందరికీ థ్యాంక్స్... నేను బాగానే ఉన్నాను

Friday,January 24,2020 - 11:59 by Z_CLU

అల వైకుంఠపురములో సక్సెస్ సంబరాల్లో హుషారుగా కనిపించాడు.
డిస్కోరాజా ప్రెస్ మీట్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొన్నాడు.
అంతలోనే అనారోగ్యానికి గురయ్యాడు సునీల్. ఉన్నఫలంగా వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. దీంతో అందర్లో ఒకటే టెన్షన్. ఏమైందంటూ ఎంక్వయిరీలు. కొన్ని గంటల పాటు అందర్నీ టెన్షన్ పెట్టిన సునీల్, తనే స్వయంగా సోషల్ మీడియాలోకి వచ్చాడు. తను బాగున్నానని, అందరికీ థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు.

కొన్ని రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు సునీల్. ఈమధ్య అవి ఇంకాస్త ఎక్కువవ్వడంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని నిన్న ఉదయమే తన పీఆర్ టీమ్ ద్వారా వెల్లడించిన సునీల్, కాస్త కోలుకొని రాత్రికి ట్విట్టర్ లోకి వచ్చాడు. హాస్పిటల్ లో దిగిన ఫొటోనే పోస్ట్ చేసి తను బాగున్నానని క్లారిటీ ఇచ్చాడు.

కొన్నాళ్లుగా సైనస్ తో బాధపడుతున్నాడట సునీల్. అదే ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఇతడు నటించిన డిస్కోరాజా సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది.