సునీల్‌, ఎన్‌.శంకర్‌ ప్రొడక్షన్‌ నెం.2 సాంగ్స్‌ రికార్డింగ్‌ ప్రారంభం

Friday,August 26,2016 - 04:18 by Z_CLU

 
మలయాళంలో విజయవంతమైన టు కంట్రీస్‌ చిత్రాన్ని సునీల్‌ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్‌ బ్యానర్‌పై పొడక్షన్‌ నెం.2గా రూపొందిస్తున్నారు. ఎన్‌.శంకర్‌ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా సాంగ్స్‌ రికార్డింగ్‌ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సాంగ్‌ రికార్డింగ్‌ను ప్రారంభించారు. టీ న్యూస్‌ ఎం.డి.సంతోష్‌ కుమార్‌ స్క్రిప్ట్‌ అందించారు.

ఈ సందర్భంగా హీరో సునీల్ మాట్లాడుతూ” మలయాళంలో దిలీప్‌గారు చేసిన సినిమా ‘టు కంట్రీస్‌’.ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ చేస్తునందుకు సంతోషంగా ఉంది. ఆయన గతంలో చేసిన సినిమాను తెలుగులో పూలరంగడు పేరుతో రీమేక్‌ చేసి సక్సెస్‌ సాధించాను. ఈ సినిమా కూడా అలాంటి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా.. ఫ్యామిలీ అంతా ఎంజాయ్‌ చేసే ఫుల్‌ ప్లెజ్డ్‌ ఎంటర్‌టైనర్‌. నా స్టయిల్‌లో ఉంటూ సరదాగా సాగే డిఫరెంట్‌ కామెడి సినిమా ఇది. ” అన్నారు.

దర్శకుడు ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ – ”మలయాళంలో దాదాపు 55 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసిన టు కంట్రీస్‌ సినిమా బావుందని నా ఫ్రెండ్స్‌ చెప్పడంతో, సినిమా చూశాను. బాగా నచ్చింది. దిలీప్‌గారు సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యి మంచి విజయం సాధించాయి. హీరో సునీల్‌ బాడీ లాంగ్వేజ్‌కు ఈ సినిమా బాగా సూట్‌ అవుతుందనిపించడంతో ఈ సినిమాను ప్రారంభించడం జరిగింది ” అన్నారు.
సునీల్‌ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: గోపీసుందర్‌, నిర్మాత, దర్శకత్వం: ఎన్‌.శంకర్‌.