ఫిబ్రవరి 15 నుండి సునీల్ సినిమా

Monday,February 13,2017 - 05:09 by Z_CLU

ఈడు గోల్డెహే తరవాత సునీల్ మలయాళం రీమేక్ 2 కంట్రీస్ లో నటించబోతున్నాడు. N. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి 15 న సెట్స్ పైకి రానుంది.

చిన్న సినిమాగా తెరకెక్కి మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 2 కంట్రీస్ ఏకంగా 55 కోట్లు వసూలు చేసింది. స్టోరీ డిమాండ్ ని బట్టి మ్యాగ్జిమం షూటింగ్ USA లో ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్.

sunil

గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇంకా టైటిల్ డిక్లేర్ చేయని ఈ సినిమాలో సునీల్ సరికొత్త మ్యానరిజం తో ఎట్రాక్ట్ చేయనున్నాడని ఫిలిం నగర్ టాక్.