సునీల్ ఇంటర్వ్యూ

Wednesday,December 27,2017 - 04:58 by Z_CLU

సునీల్ ‘2 కంట్రీస్’ ఈ నెల 29 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అల్టిమేట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సునీల్. ఈ సందర్భంగా మీడియాతో ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

నాకు సూట్ అయ్యే సినిమా….

2 కంట్రీస్ సినిమా పర్ఫెక్ట్ గా ఇప్పుడున్న నా ఇమేజ్ కి సూట్ అయ్యే సినిమా… నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సినిమాకు ఓకె అని చెప్పడానికి రీజన్ 95% కామెడీ ఉండటం, మిగిలిన 5% క్లైమాక్స్ కి ముందు హార్ట్ టచింగ్ ఇమోషన్స్. సినిమా అదిరిపోయింది.

నవ్వుతూ సెండాఫ్ చెప్తారు….

ఇయర్ ఎండ్ కి వస్తున్నాం కాబట్టి డెఫ్ఫినేట్ గా నవ్వుతూ 2017 కి సెండాఫ్ చెప్తారు. ఒకవేళ ఈ రెండు రోజుల్లో సినిమా చూడని వాళ్ళు న్యూ ఇయర్ కి నవ్వుతూ వెల్కమ్ చెప్తారు అది మాత్రం గ్యారంటీ….

పెద్దగా చేంజెస్ ఉండవు…

సినిమాలో పెద్దగా చేంజెస్ ఏమీ చేయలేదు. సెకండాఫ్ లో కొద్దిగా స్లో అవుతుంది అనుకున్నప్పుడు, సీన్స్ కొంచెం షార్ప్ చేయడం జరిగింది తప్ప, స్క్రిప్ట్ లో మార్పులేం చేయలేదు…

గ్యాప్ వచ్చినా పర్వాలేదు…

క్యారెక్టర్ బావుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఇక హీరోగా మంచి సినిమా అయితేనే చేస్తా. ‘అందాల రాముడు’ సినిమా తరవాత ‘మర్యాద రామన్న’ లాంటి సినిమా వచ్చేంత వరకు 5 ఏళ్ళు వెయిట్ చేశాను తప్ప నచ్చకపోతే చేయలేదు ఇప్పుడూ అంతే…

సినిమాలో లీడ్ రోల్స్…

ఈ సినిమాలో నాది  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఒక   ఊళ్ళో ఉండే క్యారెక్టర్. హీరోయిన్ N.R.I. లా కనిపిస్తుంది. మలయాళంలో ఈ క్యారెక్టర్ లో మమతా మోహన్ దాస్ నటించింది. హీరోకు ధీటుగా ఉండే క్యారెక్టర్.

నాకూ అలాగే ఉంది…

నాకు కూడా కామెడీ ప్రాధాన్యత ఉండే సినిమాలు చేయాలని ఉంది. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలు చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. చిన్న చిన్న కథలతో సరిపెట్టుకున్నారు….

 

అనుకుంటే హీరోలవ్వరు….

మనం హీరోలమైపోవాలనుకోగానే ఎవరూ హీరోలు అయిపోరు. నా విషయంలోను అంతే.. కమెడియన్ గా మంచి సక్సెస్ ని చూశాను. ప్రేక్షకులకు అంతలా దగ్గరయ్యాను కాబట్టే  హీరోగా అవకాశాలు వచ్చాయి చేస్తున్నాను.

నెక్స్ట్ సినిమాలు….

ప్రస్తుతానికి 3 కథలకు ఓకె చెప్పాను. ఈ సినిమా రిలీజ్  తరవాత అఫీషియల్ గా డీటేల్స్ అనౌన్స్ చేస్తాను….

కామెడీ ఉండాల్సిందే….

ఏ సినిమాలో అయినా కామెడీ ఉండాల్సిందే హీరోలు కామెడీ చేయాల్సిందే. కామెడీ చేయని స్టార్ లేరు. అమితాబ్ బచ్చన్ అంతటి స్టార్స్ కూడా కామెడీ చేస్తారు. సో కామెడీ ఎప్పుడూ డిమాండ్ ఉన్న ఎలిమెంటే.

సినిమా గురించి ఒక మాటలో…

ఈ ఇయర్ నా సినిమాల్లో  ఇది బెస్ట్ సినిమా అవుతుంది.