త్రివిక్రమ్ డైరెక్షన్ లో సునీల్?

Friday,October 07,2016 - 10:00 by Z_CLU

 ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సునీల్  మళ్ళీ కామెడీ పాత్రతో అలరించబోతున్నాడు.. తాజాగా సునీల్ నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ విడుదలకు సిద్దమైంది. దసరా రేస్ లో నిలిచిన ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంపార్టెన్స్ ఉంటే ఎలాంటి పాత్ర అయినా చేస్తానని తెలిపాడు సునీల్.

eedu-goldehe-1

         అయితే తాజాగా సునీల్… త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఓ రోల్ చేయనున్నాడట. గతంలో  పవన్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘జల్సా’ లో సునీల్ కామెడీ బాగా పండింది. అందుకే సునీల్ కోసం ఓ ప్రత్యేక పాత్ర సృష్టించాడట మాటల మాంత్రికుడు. ఈ రోల్ చెయ్యడానికి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.