రజని తరువాత సునీల్...

Monday,July 25,2016 - 12:18 by Z_CLU

 

ఇక ఇటీవలే రజని నటించిన ‘కబాలి’ భారీ అంచనాల నడుమ 22 న విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రజని కి ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే బాలీవుడ్ హీరో లు సైతం రజని సినిమా విడుదల ముందు కానీ వెనుక కానీ వచ్చే ప్రయత్నం చెయ్యరు . రజని సినిమా టాక్ తెలుసుకున్న తరువాతే తమ సినిమాలను బరి లో కి దింపుతారు. ఇక కబాలి విడుదల తరువాతే తమ చిత్రాల విడుదల తేదీలను అనౌన్స్ చేద్దామనుకున్న టాలీవుడ్ నిర్మాతలు ఒక్క సారి గా తమ సినిమాల విడుదల తేదీలను వరుసగా ప్రకటిస్తున్నారు. ఇక ఈ వరుసలో ముందున్నాడు హాస్య కథానాయకుడు సునీల్. ఈ కథానాయకుడు తాజాగా నటించిన ‘జక్కన్న’ చిత్రాన్ని ఈ నెల 29 న విడుదల చెయ్యడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. ఇక టాలీవుడ్ లో రజని కబాలి తరువాత ‘జక్కన్న’ చిత్రంతో థియేటర్స్ లో సందడి చెయ్యబోతున్నమాట సునీల్..