NTR Trivikram Movie - విలన్ ఎవరంటే?

Tuesday,March 30,2021 - 12:13 by Z_CLU

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో మళ్ళీ ఓ సినిమా చేయబోతున్నాడు తారక్. ‘అరవింద సమేత’ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. NTR30 గా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం నటీనటులను ఎంపికతో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. అయితే ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటించనున్నాడని తెలుస్తుంది. సునీల్ తాజాగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా సునీల్ ని పూర్తి నెగిటివ్ షేడ్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.

ఇందులో సునీల్ గెటప్ కూడా డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. అయితే సునీల్ ఇందులో మెయిన్ విలన్ గా కనిపిస్తాడా ? లేదా విలన్ పక్కన ఉండే ఏదైనా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తాడా ? అనేది తెలియాల్సి ఉంది.

ఏదేమైనా తన మిత్రుడు సునీల్ ని ఈసారి త్రివిక్రమ్ తన స్టైల్ లో సరికొత్తగా ప్రెజెంట్ చేయడం పక్కా.