మరో సినిమాకు ఓకే చెప్పిన సునీల్

Saturday,May 19,2018 - 12:13 by Z_CLU

హీరో పాత్రలు తగ్గించి, మళ్లీ కామెడీ/క్యారెక్టర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవ్వాలని చాన్నాళ్ల కిందటే నిర్ణయించుకున్నాడు సునీల్. ఇందులో భాగంగా మరో ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం సెట్స్ ఉన్న శర్వానంద్ సినిమాలో పడి పడి లేచే మనసు చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు సునీల్.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు సునీల్. చిరంజీవి హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీలో సైరాలో కూడా కనిపించనున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పుడు శర్వానంద్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమాలో కాస్త కామిక్ గా ఉంటూనే, కథలో మలుపుతిప్పే సందర్భంలో సునీల్ కనిపిస్తాడట.

సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి కలిసి నిర్మిస్తున్నారు.