సునీల్ '2 కంట్రీస్' ఫస్ట్ లుక్ రిలీజయింది

Thursday,November 16,2017 - 02:03 by Z_CLU

సునీల్, మనీషా రాజ్ జంటగా నటించిన ‘2 కంట్రీస్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజయింది. మళయాళ బ్లాక్ బస్టర్ ‘2 కంట్రీస్’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.  దానికి తోడు ఈ రోజు రిలీజైన ఈ ఫస్ట్ లుక్ మాస్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ అటెన్షన్ ని కూడా గ్రాబ్ చేస్తుంది.

నరేష్, శ్రెనివాస్ రెడ్డి తో పాటు పృథ్వీ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. N. శంకర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.