నవంబర్‌లో 'తెనాలి రామకృష్ణ BA BL'

Wednesday,October 16,2019 - 10:14 by Z_CLU

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణ BABL’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను నవంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. జి నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తుండగా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది.

 శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుంది.  తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.