A1 ఎక్స్ ప్రెస్ లాంఛ్

Monday,November 04,2019 - 11:55 by Z_CLU

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో హిట్ కొట్టిన సందీప్ కిష‌న్.. హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. ఈరోజు ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఓపెనింగ్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ ను కూడా ఇవాళ్టి నుంచే మొదలుపెట్టారు. ముర‌ళీ శ‌ర్మ‌, ర‌ఘుబాబు, సందీప్ కిష‌న్‌ల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. అలాగే ఈ జోన‌ర్‌లో సందీప్ కిష‌న్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే.

హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను
నిర్మాత‌లు: టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
బ్యాన‌ర్స్‌: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్
కో ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్‌: హిప్ హాప్ త‌మిళ‌
కెమెరా: కెవిన్ రాజు
ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌
ఆర్ట్‌: అలీ
కాస్ట్యూమ్ డిజైన్‌: హ‌ర్మ‌న్‌
పి.ఆర్‌.ఒ: ఎల్‌.వేణు గోపాల్‌, వంశీశేఖ‌ర్‌