Sundeep Kishan - టైటిల్ మారింది

Friday,March 26,2021 - 11:58 by Z_CLU

కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా కాంబినేషన్‌లో సందీప్ కిష‌న్ హీరోగా రూపొందుతోన్న చిత్రానికి టైటిల్ మార్పు.. గ‌ల్లీరౌడీగా టైటిట్ ఫిక్స్

కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు, పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూతనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకున్న యువ హీరో సందీప్‌ కిషన్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి ముందుగా ‘రౌడీ బేబీ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

కొన్ని సాంకేతిక కార‌ణాల కార‌ణంగా ఈ సినిమా టైటిల్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మార్చారు. ఇప్పుడీ చిత్రానికి ‘గ‌ల్లీరౌడీ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తున్న‌ట్లు యూనిట్ అఫీషియల్ గా ప్ర‌క‌టించింది. ఇంతకుముందు ఈ సినిమాకు రౌడీ బేబీ అనే టైటిల్ పెట్టారు.

sundeep kishan Gully Rowdy 1

రైట‌ర్ కోన వెంక‌ట‌్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరిస్తున్నారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు.