Sundeep Kishan : రేపు ఏం చెప్పబోతున్నాడు?

Sunday,August 16,2020 - 06:37 by Z_CLU

“నా జీవితానికి సంబంధించి ఎన్నో విషయాల్ని మళ్లీ గుర్తుచేసుకోవడానికి 2020 బాగా పనికొచ్చింది. అంతేకాదు, ఏది ఆనందాన్నిస్తుందో కూడా తెలుసుకున్నాను. నా జీవితంలో నెక్ట్స్ బిగ్ స్టెప్ వేయడానికి 2020 నాకు చాలా సమయాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. ఇది నా లైప్ లో మోస్ట్ ఎక్సయిటింగ్. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. సోమవారం చెబుతాను.”

ఓ 2 రోజుల కిందట Sundeep Kishan పెట్టిన పోస్ట్ ఇది. దీంతో రేపు అతడు ఎలాంటి ఎనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తోంది. సందీప్ కిషన్ కూడా పెళ్లి (Sundeep Kishan wedding) చేసుకోబోతున్నాడంటున్నారు కొంతమంది. అంతకంటే ముందు తన ప్రేమ విషయాన్ని సందీప్ రివీల్ చేస్తాడని మరికొందరు అంటున్నారు.