Sundeep Kishan Gally Rowdy - ఐటెం సాంగ్ అదిరింది

Thursday,July 22,2021 - 06:38 by Z_CLU

సందీప్ కిషన్ హీరోగా G నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘గల్లీ రౌడీ’ నుండి సెకండ్ సింగిల్ రిలీజైంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా ఈ సాంగ్ లాంచ్ చేసింది. ‘చాంగురే ఐటెం సాంగురే’ అంటూ విడుదలైన ఈ ఐటెం సాంగ్ ప్రెజెంట్ మాస్ నంబర్స్ ఇష్టపడే మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. సాయి కార్తీక్ అందించిన ఎనర్జిటిక్ ట్యూన్ కి ఈ సాంగ్ కి మంచి మాస్ లిరిక్స్ తో మరింత అందం తీసుకొచ్చాడు భాస్కర్ భట్ల.

లిరికల్ వీడియో లో సాంగ్ విజివల్స్ కూడా వదిలారు మేకర్స్. సందీప్ కిషన్ డ్యాన్స్ తో పాటు నేహా గుప్తా అందాల ఆరబోత సాంగ్ కి ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈ సాంగ్ కి ప్రేమ రక్షిత్ మాస్టర్ కోరియోగ్రఫీ కూడా ప్లస్ పాయింట్ అవ్వనుందని ప్రోమో చూస్తే తెలుస్తుంది.

సాయి కార్తీక్ మ్యూజిక్ , భాస్కరభట్ల లిరిక్స్ తో పాటు మంగ్లీ సింగింగ్ కూడా సాంగ్ కి కలిసొచ్చింది. ఇలా అన్నీ చక్కగా కుదిరిన ఈ ఐటెం సాంగ్ ఆల్బంలో సూపర్ హిట్ మాస్ నంబర్ అనిపించుకుంది. MVV సినిమా, కోనా ఫిలిం కార్పోరేషన్ బేనర్స్ పై MVV సత్యానారాయణ , కోనా వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics