రిలీజ్ డేట్ దగ్గర పడింది...

Wednesday,March 20,2019 - 02:39 by Z_CLU

రిలీజ్ డేట్ దగ్గర పడింది…. ఈ మాట జస్ట్ ఒక సినిమాకి సంబంధించింది కాదు. సెట్స్ పైకి వచ్చినప్పుడే సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేసుకున్న సినిమాలది. ఇప్పటికే తమ తమ స్ట్రాటజికల్ ప్రమోషన్స్ తో ఆడియెన్స్ పల్స్ రేట్ ని పెంచేసిన మోస్ట్ వాంటెడ్ సినిమాలు ఆడియెన్స్ అంచనాలకు ధీటుగా ముస్తాబై బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నాయి. అయితే వీటిలో మ్యాగ్జిమం స్థాయి బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా మహేష్ బాబు ‘మహర్షి’. మే 9 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటే ఈ సినిమా ఏ స్థాయిలో డిమాండ్ క్రియేట్ చేసుకుందో అర్థమవుతుంది.

మార్చి 29 న రిలీజవుతుంది అర్జున్ సురవరం. సరిగ్గా అదే రోజు RGV ‘లక్ష్మీస్ NTR’ కూడా ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ 2 సినిమాల మధ్య కావాల్సినంత కామెడీతో పాటు కూసంత సెంటిమెంట్ కూడా అద్దుకుని నిహారిక ‘సూర్యకాంతం’ కూడా అదే రోజు రిలీజవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ 3 సినిమాలు చేయబోయే హంగామాతో సమ్మర్ బాక్సాఫీస్ సీజన్ బిగిన్ కానుంది.

ఈ 3 సినిమాలు జోనర్స్ ఆంగిల్ లో చూసినా వేటికవే స్పెషల్, దానికి తోడు ఒక్కో సినిమాకి ఒక్కో సెట్ ఆఫ్ ఆడియెన్స్ ఉన్నారు కాబట్టి న్యాచురల్ గానే ఈ సినిమాల ప్రమోషన్స్ కి తగ్గట్టే, ఫ్యాన్స్ లో రెస్పాన్స్ కూడా ఉంది. అయితే ఈ వీకెండ్ తరవాత వస్తున్న వరసగా రానున్న సినిమాలు మాత్రం మ్యాజికల్ మూమెంట్స్ ని క్రియేట్ చేయబోతున్నాయి.

వరసగా జెర్సీ… మజిలీ… ఈ 2 సినిమాల కోసం టోటల్ టాలీవుడ్ ఎదురు చూస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ సమ్మర్ లో కావాల్సినంత ఇమోషన్ ని స్ప్రెడ్ చేయబోతున్నాయి ఈ సినిమాలు. ఇదే వరసలో బెల్లంకొండ శ్రీనివాస్ సీత కూడా ఏప్రియల్ లాస్ట్ వీకెండ్ లో సందడి చేయబోతుంది. అయితే ఇంత హంగామాలో కూడా ఎక్కడో ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ డేట్ కూడా డెఫ్ఫినెట్ గా ఈ సీజన్ లోనే ఉంటుందని, ఎప్పుడెప్పుడు ఫిల్మ్ మేకర్స్ నుండి ఏ అప్డేట్ వస్తుందోనని ఓ కన్నేసి ఉంచారు.