సమ్మర్ సినిమాలు - రిలీజ్ డేట్స్

Monday,February 26,2018 - 02:09 by Z_CLU

సమ్మర్ సినిమాలు దాదాపు కన్ ఫర్మ్ అయ్యాయి. మార్చి 30 నుంచి మే రెండో వారం వరకు ఏ వీకెండ్ ఖాళీ లేదు. అన్నీ దాదాపు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. థియేటర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకునే పనిలో ఉన్నాయి. ఈ వేసవికి టాలీవుడ్ లో రసవత్తరమైన పోరు సాగనుంది. వారానికో సినిమా వస్తోంది. ఆ మూవీ డీటెయిల్స్ ఎక్స్ క్లూజివ్ గా మీకోసం.

1. రంగస్థలం – రిలీజ్ డేట్ మార్చి 30

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న రంగస్థలం సినిమా నుంచి సమ్మర్ ఫీవర్ షురూ అవుతుంది. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 1980ల నాటి కథతో తెరకెక్కింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

2. ఛల్ మోహన్ రంగ – రిలీజ్ డేట్ ఏప్రిల్ 5

నితిన్, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. కృష్ణచైతన్య డైరక్ట్ చేసిన ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ అందించాడు. పవన్, త్రివిక్రమ్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కలిసి ఈ సినిమా నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల్ని దశలవారీగా విడుదల చేస్తున్నారు. ఈ వేసవికి పెర్ ఫెక్ట్ రొమాంటిక్ మూవీగా ఇది పేరుతెచ్చుకుంది.

3. కృష్ణార్జున యుద్ధం – రిలీజ్ డేట్ ఏప్రిల్ 12

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఈ సమ్మర్ లో కూడా మరో సినిమా రిలీజ్ చేయబోతున్నాడు. నేచురల్ స్టార్ డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా ఇది. మేర్లపాక గాంధీ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోయిన్లుగా నటించారు.  హిపాప్ తమీజా ఈ సినిమాకు సంగీతం అందించాడు.

4. భరత్ అనే నేను – రిలీజ్ డేట్ ఏప్రిల్ 20

మహేష్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఇది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్-కొరటాల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భరత్ అనే నేనుపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో కైరా అద్వానీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మూవీకి సంబంధించి త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది.

5. కాలా – రిలీజ్ డేట్ ఏప్రిల్ 27

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా కాలా. ఈ మూవీని ఏప్రిల్ 27న ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. పా రంజిత్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు రజనీ అల్లుడు ధనుష్ నిర్మాత. తెలుగులో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు.

6. నా పేరు సూర్య – రిలీజ్ డేట్ మే 4

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ఇది. వక్కంతం వంశీ డైరక్టర్ గా పరిచయమౌతున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతోంది. ఈ సమ్మర్ బరిలో పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం ఇదే. విశాల్-శేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

7. సాక్ష్యం – రిలీజ్ డేట్ మే 11

యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్,  బ్యూటిఫుల్ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సాక్ష్యం సినిమా కూడా సమ్మర్ కానుకగా ముస్తాబవుతోంది. శ్రీవాస్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

8. పంతం – రిలీజ్ డేట్ మే 18

గోపీచంద్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రమిది. కొత్త దర్శకుడు చక్రవర్తి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటోంది. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.