సిసలైన సమ్మర్ ఈ నెలాఖరు నుంచే

Monday,March 20,2017 - 04:53 by Z_CLU

టాలీవుడ్ సమ్మర్ సీజన్ కి గ్రాండ్ ప్రిపరేషన్ లో ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్స్ దగ్గరి నుండి మెస్మరైజింగ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ వరకు హాట్ హాట్ సమ్మర్ లో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ వరసలో సిసలైన సమ్మర్ ఈ నెలాఖరు నుంచే బిగిన్ కానుంది.

సిసలైన సమ్మర్ కి స్పెషల్ ఎట్రాక్షన్  గా గ్రాండ్  ఓపెనింగ్స్ తో దూసుకొస్తున్నాడు కాటమరాయుడు. హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయిన ఈ సినిమా మార్చి 24 న థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కిషోర్ కుమార్ పార్ధసాని డైరెక్షన్ లో తెరకెక్కింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రోగ్ మార్చి 31 నుండి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది.  ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్ గా నటించారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని C.R. మనోహర్, C.R. గోపి నిర్మించారు.

విక్టరీ వెంకటేష్ కరియర్ లోనే డిఫెరెంట్ సినిమా గురు. ఏప్రియల్ 4 న రిలీజ్ కానున్న ఈ సినిమాలో రితిక సింగ్ హీరోయిన్ గా నటించింది. అల్టిమేట్ మాస్ & స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సాలా ఖడూస్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కింది మిస్టర్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. మిక్కీ జె.మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మించారు. ఈ సినిమా ఏప్రియల్ 14 న రిలీజ్ అవుతుంది.

ఇండియన్అం సినిమా హిస్టరీ లోనే బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్.  హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ మొత్తానికే బిగ్గెస్ట్ మోస్ట్ అవేటింగ్ ఎంటర్ టైనర్. ఏప్రియల్ 28 న వరల్డ్ వైడ్ గా రిలీజవుతున్న బాహుబలి 2 ఈ సమ్మర్ సీజన్ కే బిగ్గెస్ట్ ఎట్రాక్షన్.