సుమంత్ హీరోగా సెట్స్ పైకి కొత్త సినిమా

Saturday,November 02,2019 - 02:31 by Z_CLU

వైవిధ్య‌మైన క‌థాంశాలతో సినిమాలు చేస్తూ హీరోగా త‌న‌కంటూ ఇమేజ్‌ను సంపాదించుకున్న నటుడు సుమంత్‌. ఈయ‌న హీరోగా న‌టిస్తున్న త‌దుపరి చిత్రం లాక్ అయింది. క‌న్న‌డ చిత్రం `కావ‌లూడారి` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. క‌న్న‌డలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.

న‌వంబ‌ర్ 1 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను చెన్నైలో స్టార్ట్ చేశారు. చెన్నై, హైద‌రాబాద్ ప్రాంతాల్లో జ‌న‌వ‌రిలో జరిగే సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారు. మార్చి నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రీమేక్ చేయ‌బోతున్నారు. క్రియేటివ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యాన‌ర్‌పై డా.జి.ధ‌నంజ‌య‌న్ ఈ చిత్రాన్ని రెండు భాష‌ల్లో నిర్మిస్తున్నారు. సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండగా… త‌మిళ వెర్ష‌న్‌లో ఇత‌ర న‌టీన‌టుల‌తో ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు.

ఇటీవ‌ల విడులైన విజ‌య‌వంత‌మై అర్జున్‌, విజ‌య్ ఆంటోని `కిల్ల‌ర్‌`చిత్రంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు సంపాదించుకున్న‌సైమ‌న్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్ష‌న్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. విజ‌య్ ఆంటోనితో భేతాళుడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.