కపటధారిగా మారిన సుమంత్

Tuesday,November 19,2019 - 12:37 by Z_CLU

సుమంత్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. లోగో డిజైన్ కూడా రిలీజ్ చేశారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఈ అక్కినేని హీరో. ఈ సినిమాకు కపటధారి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా మోషన్ పోస్టర్ ను అక్కినేని నాగార్జున లాంఛ్ చేశాడు.

టైటిల్ రిలీజ్ సందర్భంగా మరో కొత్త విషయం కూడా బయటపెట్టారు మేకర్స్. ఇదొక రీమేక్ అనే విషయాన్ని చెప్పారు. కన్నడలో సూపర్ హిట్ అయిన కవలదారు అనే సినిమాకు రీమేక్ గా కపటధారి రాబోతోంది. డిఫ‌రెంట్ పాయింట్‌తో వస్తున్న ఈ రీమేక్ ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. తెలుగు వెర్ష‌న్‌లో సుమంత్‌, నాజ‌ర్‌, నందిత‌, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కనిపిస్తారు.

ఇటీవ‌ల విడులై విజ‌య‌వంత‌మై `కిల్ల‌ర్‌` చిత్రంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు సంపాదించుకున్న‌సైమ‌న్ కె.కింగ్ ఈ కపటధారి చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్ష‌న్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి.. గతంలో విజ‌య్ ఆంటోనితో భేతాళుడు చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.