మరో డిఫరెంట్ మూవీతో...

Monday,October 24,2016 - 12:59 by Z_CLU

సుమంత్ నుంచి సినిమా వచ్చి 34 నెలలైంది. ఈ మధ్యంతా ఖాళీగానే ఉన్న సుమంత్… ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విలక్షణమైన కథల్ని సెలక్ట్ చేసుకునే సుమంత్… ఎప్పట్లానే ఈసారి కూడా మరో డిఫరెంట్ స్టోరీతో మనముందుకొస్తున్నాడు. వీర్యదాతగా సుమంత్ నటించిన ఆ సినిమా నరుడా..డోనరుడా.

2014 లో ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా తరువాత దాదాపు 34 నెలలు గ్యాప్ తో `న‌రుడా.. డోన‌రుడా` సినిమా చేశాడు సుమంత్. నవంబర్ 4 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరో 3 రోజుల్లో ఆడియో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘గోల్కొండ హై స్కూల్’, ‘ఏమో గుర్రం ఎగరా వచ్చు’ వంటి డిఫెరెంట్ సినిమాలతో ఆకట్టుకున్న సుమంత్… తాజా చిత్రం కూడా ఆడియన్స్ కు రీచ్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు.

0013374
అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై వై.సుప్రియ‌, సుధీర్ పూదోట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ‌ల్లిక్‌రామ్ దర్శకుడు. సుమంత్ సరసన ప‌ల్ల‌వి సుభాష్‌ హీరోయిన్ గా నటిస్తుంది.