కొత్త సినిమాతో డోనరుడు రెడీ

Wednesday,March 15,2017 - 06:38 by Z_CLU

లాస్ట్ ఇయర్ నరుడా డోనరుడా లాంటి డిఫెరెంట్ సినిమాతో ఎంటర్ టైన్ చేసిన సుమంత్ మరో కొత్త సినిమాతో రెడీ అయిపోయాడు. సినిమా సినిమాకి గ్యాప్ వచ్చినా పర్వాలేదు కానీ, సినిమా డిఫెరెంట్ గా ఉంటేనే సంతకం అని కంకణం కట్టుకున్న సుమంత్ నెక్స్ట్ సినిమా, ఈ రోజే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ నటిస్తుంది.

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా మార్చి లాస్ట్ వీక్ నుండి ఫుల్ టైం షెడ్యూల్స్ తో సెట్స్ పైకి రానుంది. రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రవణ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.