సుమంత్ 'ఇదంజగత్' రిలీజ్ డేట్ ఫిక్సయింది

Saturday,December 22,2018 - 02:29 by Z_CLU

రీసెంట్ గా ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాతో సుమంత్ ఏ జోనర్ సినిమాకైనా పర్ఫెక్ట్ గా సూటవుతాడు అనిపించుకున్నాడు. ఇప్పుడు అదే స్పీడ్ లో  ‘ఇదం జగత్’ సినిమాతో రెడీగా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పుకున్న మేకర్స్, ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ నెల 28 న రిలీజవుతుంది ఇదం జగత్.

ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడు సుమంత్. సెల్ఫిష్ క్రై మ్ రిపోర్టర్ ఈ సినిమాలో సుమంత్ ప్లే చేస్తున్న రోల్. జస్ట్ తన గురించి, తన ప్రయోజనాల గురించి తప్ప, ఇమోషన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వని క్యారెక్టర్ లో కొత్తగా   కనిపించనున్నాడు   సుమంత్ ఈ సినిమాలో.

ఈ సినిమాలో సుమంత్ సరసన అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేశాడు. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా ఈ సినిమాని విరాట్ ఫిలిమ్స్ అండ్ శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.