ఫస్ట్ టైమ్ విలన్ షేడ్స్ లో నటిస్తున్న హీరో

Monday,June 25,2018 - 03:36 by Z_CLU

రీసెంట్ గా ‘మళ్ళీరావా’ సినిమాతో హిట్ అందుకున్న సుమంత్ మరో ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ ఇదం జగత్’ తో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సినిమా యూనిట్, ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.

సుమంత్ చేతిలో టార్చిలైట్ తో డెడ్ బాడీ పక్కన కూర్చుని ఎగ్జామిన్ చేస్తున్న స్టిల్ తో రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా ప్రమోషన్స్ బిగిన్ చేసిన ఫిల్మ్ మేకర్స్ త్వరలో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

 

ఈ సినిమాలో సుమంత్ సరసన అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి అనిల్ శ్రీకంఠం దర్శకత్వం వహిస్తున్నాడు. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా చేయాల్సి ఉంది.