'సుమంత్' ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Monday,December 03,2018 - 01:29 by Z_CLU

సెన్సిబుల్ హీరో సుమంత్ లేటెస్ట్ మూవీ ‘సుబ్రహ్మణ్య‌పురం’ ఈ నెల 7న ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ తో ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడారు. . ఆ విశేషాలు సుమంత్ మాటల్లోనే…

జాగ్రత్తగా ప్లాన్ చేసాం

ఈరోజుల్లో ప్రేక్షకులను థియేటర్స్ కి తీసుకురావడానికి టీజర్, ట్రైలర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు , మీడియం బడ్జెట్ సినిమాలకు ట్రైలర్ అనేది కీలకం. ట్రైలర్ చూసాకే ఆడియన్స్ సినిమా చూడాలా వద్దా అని డిసైడ్ అవుతారు. అందుకే సుబ్రహ్మణ్యపురం టీజర్, ట్రైలర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసాం. ట్రైలర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు దర్శకుడితో మాట్లాడుతూ ట్రైలర్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాను. ఫైనల్ గా మేం అనుకున్నట్టే టీజర్ తో పాటు ట్రైలర్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను సపోర్ట్ చేస్తూ చాలా మంది ట్రైలర్ ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసారు. కొందరు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేసారు. ఈ సందర్భంగా అందరికీ థాంక్స్ చెప్తున్నా.

స్టోరీ బేస్డ్ మూవీ

ఎప్పుడూ కమర్షియల్ లెక్కలు వేసుకొను, అదే నాకు ప్లస్ అండ్ మైనస్. ‘సుబ్రహ్మణ్య‌పురం’ కథ వినగానే సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ స్టోరీ సిట్టింగ్ అప్పుడు నచ్చదు అనే మైండ్ సెట్ తోనే విన్నాను. కానీ కథ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. సంతోష్ రెండున్నర గంటల నారేషన్ నన్ను ఎంగేజ్ చేసింది. అందుకే ఎలాంటి మార్పులు చేయకుండా కథ చేసాను. ‘సుబ్రహమణ్యపురం’ స్టోర్ బేస్డ్ మూవీ. ఇలాంటి స్టోరీ బేస్డ్ మూవీ చేయడం హ్యాపీ గా ఉంది.

‘మళ్ళీ రావా’ తర్వాత….

‘మళ్ళీ రావా’ తర్వాత రొమాంటిక్ స్టోరీస్ వస్తాయనుకుంటే వరుసగా అన్నీ థ్రిలర్స్ వచ్చాయి. వరుసగా ఇలా థ్రిల్లర్స్ చేస్తానని ఊహించలేదు. ‘ఇదం జగత్’ కూడా థ్రిల్లర్ స్టోరీ తో ఎంగేజ్ చేసే సినిమా. కాకపోతే దేనికదే కొత్తగా ఉంటుంది. నా నుండి వస్తున్న ఈ థ్రిల్లర్స్ కచ్చితంగా ఆడియన్స్ ని కొత్తగా ఎంటర్టైన్ చేస్తాయని నమ్ముతున్నా.

సంతోష్ కి మంచి పేరొస్తుంది

సంతోష్ నాకు చెప్పినప్పుడు కొత్త దర్శకుడైనా కథ బాగా చెప్పాడు కానీ ఎలా తీస్తాడో అనే సందేహాలుండేవి. కానీ అతను తీసిన షార్ట్ ఫిల్మ్ చూసాక నమ్మకం వచ్చింది. నాకు చెప్పిన కథ కి 90 శాతం న్యాయం చేసాడు. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో పాటు క్యారెక్టర్స్ కూడా బాగా డిజైన్ చేసుకున్నాడు. కథలో నా క్యారెక్టర్ మాత్రమే కాదు అన్నీ క్యారెక్టర్స్ బాగుంటాయి. సినిమా చూసాక నేను నటుడిగా పూర్తి స్థాయిలో సాటిస్ఫై అయ్యాను.


కొత్త క్యారెక్టర్ తో కొత్తగా

ఇందులో కార్తిక్ అనే క్యారెక్టర్ చేసాను. ‘మళ్ళీ రావా’ తర్వాత మళ్ళీ కార్తీక్ గానే కనిపిస్తున్నా అన్నమాట.. కార్తీక్ హేతువాది, దేవుణ్ణి నమ్మడు కానీ, గుళ్ళ గురించి రీసెర్చ్ చేస్తుంటాడు. ఈ పాత్ర తో నా ట్రావెల్ నాకు కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందించింది. ఈ పాత్ర కోసం నేను పెద్దగా కష్టపడలేదు. నేచురల్ గానే కనిపిస్తాను.

థియేటర్స్ లో విజిల్స్ వేస్తా

నాకు హీరో బిల్డప్ సీన్స్, ఎలివేషన్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నా సినిమా వరకూ హీరోఇజం చివర్లో ఉండాలనుకుంటాను. కానీ నా ఫ్రెండ్స్ మహేష్, తారక్ సినిమాలలో అలాంటి హీరోఇజం సీన్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తుంటాను. థియేటర్స్ ఆ సీన్స్ కి విజిల్స్ వేస్తా.

ఈషా రెబ్బ క్యారెక్టర్..

ఈ సినిమాలో నేను హేతువాదినైతే, ఈషా సాంప్రదాయాలను గౌరవించే అమ్మాయి. వీరి మద్య కొన్ని గొడవలు జరుగుతుంటాయి. కానీ మా ట్రావెలింగ్ వచ్చే సీన్స్ ఎంటర్టైన్ చేస్తాయి.

‘రానా’ నా ఛాయిసే

సినిమా ప్రారంభంలో కథను తెలిపే ఓ వాయిస్ ఓవర్ అవసరం అనిపించింది. తెలుగు స్పష్టంగా పలక గలిగిన గొంతు కావాలి. ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తే నా మైండ్ లో వచ్చిన స్ట్రైక్ అయిన ఫస్ట్ పేరు రానా . రానా స్క్రిప్ట్ విని వెంటనే ఒప్పుకున్నాడు. ఆ వాయిస్ కథనం కు బలంగా మారింది.

 

ప్రొడక్షన్ వాల్యూస్

నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి గారి ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయిని పెంచాయి. ఆయన పైనాన్షియర్ గా కొన్ని మంచి సినిమాలకు సపోర్ట్ అందించారు. ఈ సినిమాను నిర్మించాలంటే గట్స్ ఉన్న నిర్మాతలు కావాలనిపించింది. ముందు ఒక చిన్న బడ్జెట్ అనుకున్నాం.. కానీ విజువల్ ఎఫెక్ట్స్ వల్ల అనుకున్న దానికంటే మంచి అవుట్ పుట్ తీసుకురావడం కోసం బడ్జెట్ పెరిగింది. అయినా ఆయన ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నాగా చైతన్య కూడా ఫోన్ చేసి ‘ఎక్కడా చూసినా హోర్డింగ్స్ తో మీరే కనిపిస్తున్నారని’ అన్నయ్య అని చెప్పాడు. అలాంటి ప్రొడ్యూస‌ర్ దొరికినందుకు హ్యాపీ. ఈ సినిమా బాగా ఆడి నిర్మాతగా ఆయనకీ మంచి గుర్తింపుతో డబ్బు కూడా రావాలని ఆశిస్తున్నా.

శేఖర్ చంద్ర సినిమాకు బ్యాక్ బోన్

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరైతే బాగుంటుంది అని డిస్కర్షన్. శేఖ‌ర్ చంద్ర పర్ఫెక్ట్ అనిపించింది. తను నాకు చిన్నప్పటి నుండి తెలుసు. వాళ్ళ నాన్న గారితో రెండు సినిమాలు రీసెంట్ గా శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ సినిమాలో అతని వర్క్ చూసి అభినందించాలనిపించింది. నిజానికి ఈ సినిమాకు శేఖర్ చంద్ర బ్యాక్ బోన్ అనుకోవ‌చ్చు. చాలా అద్బుతంగా మ్యూజిక్ అందించాడు. ఇందులో మూడు పాట‌లు చాలా బాగుంటాయి. రిలీజ్ తర్వాత అత‌ని వ‌ర్క్ గురించి అంద‌రూ మాట్లాడుకుంటారు.

ఎంత అవ‌స‌ర‌మో అంతే

సినిమా లో గ్రాఫిక్స్ కి స్కోప్ ఉంది. కానీ క‌థ ప‌రంగా ఎంత అవ‌స‌ర‌మో అంతే చేసాం. సినిమా విజువ‌ల్ ఎఫెక్ట్స్ మొత్తం అన్న‌పూర్ణ టీం చేసింది. ఆడియన్స్ త‌ప్ప‌కుండా స‌ర్ ప్రైజ్ అవుతారు.

అనుకోని అదృష్టం

క్రిష్ నాకు ఎప్పటి నుండో తెలుసు. నాకిష్టమైన దర్శకుల్లో క్రిష్ ఒకరు. అయితే ‘NTR’సినిమాలో తాత పాత్ర చేయాలనీ అడగగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. తాత గారి పాత్ర చేయడం బాధ్యతగా అనిపించింది. సినిమాలో ఆయన్ని పెద్ద‌గా ఇమిటేట్ చేయ‌లేదు. ఆ క్యారెక్టర్ చేసే ముందు తాత నటించిన సినిమాలు మళ్ళీ చూసాను. అలాగే ఆయన ఇంట‌ర్యూ లు కూడా చూసాను. ఇమిటేష‌న్ కి యాక్టింగ్ కి మ‌ద్య లో చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను. నా పాత్ర తాలుకు షూటింగ్ అయిపొయింది. ‘కథానాయకుడు’ తో పాటు ‘మహానాయకుడు’ లో కూడా కొద్ది సేపు కనిపిస్తా.


తాత గారి పాత్ర కోసం…

సినిమాలో తాత గారి క్యారెక్టర్ తో వచ్చే సీన్స్ క్రిష్ చాలా బాగా రాసాడు. ఆ పాత్ర కోసం నాలుగు కేజీల బరువు తగ్గాను. మేకప్ వేసుకోవడం , హోం వర్క్ చేయడం కానీ కొత్త అనుభూతి కలిగించింది. ఫస్ట్ లుక్ రిలీజ్ వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందించా. నిజానికి ఇంకో లుక్ కూడా ఉంది ఐయాం షూర్ దానికి ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది.

 

బాలకృష్ణ గారు ఒక ‘ఎన్ సైక్లో పిడియా’

బాల‌కృష్ణ‌గారితో పనిచేయ‌డం గొప్ప‌గా అనిపించింది. ఆయన ఎన్ సైక్లో పిడియా అన్ని విషయాల్లో ఆయనకి పట్టుంది. ముఖ్యంగా మన తెలుగు బాష మీద మన పురాణాల మీద ఆయనకీ మంచి అవగాహణ ఉంది. షూటింగ్ విరామంలో తాత సినిమాలు , ఎన్టీఆర్ గారి సినిమాల్లో సీన్స్ గురించి చెప్తూ ఆ డైలాగ్స్ కూడా చెప్తుంటే నోరెళ్ళ బెట్టి అలాగే వినే వాడిని.

 

బ్యాలెన్స్ గా

నేను చేసిన సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు కాస్త డిసపాయింట్ అవుతుంటా అది కామనే.. హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోను అలాగే ఫ్లాప్స్ అయినప్పుడు కుంగిపోను. ఎప్పుడూ బ్యాలెన్స్ గానే ఉంటా.

అదే నా పాలసీ…

నా దగ్గరికొచ్చి సినిమా చేద్దామనగానే నా మొదటి ప్రిఫరెన్స్ కథకే.. ఏ సినిమాకైనా కథే మూలం. నాకు నచ్చే మంచి కథలు దొరికితేనే సినిమాలు చేస్తా.. కాలిగా అయినా వుంటాను కానీ సినిమాలోస్తున్నాయి కదా అని ఏ సినిమా బడితే ఆ సినిమా చేయను. గతంలో అలా చేసిన సినిమాలు నాకు గుణపాఠం నేర్పాయి. అందుకే నటుడిగా మంచి స్టోరీ బేస్డ్ మూవీస్ చేయాలన్నదే నా పాలసీ.

ఊసరవెల్లి లా..

ఒకే జోనర్ లో రొటీన్ ఫార్మేట్ కి అంకితం కాకుండా అన్ని రకాల కథలు చేయాలనుంది. లైక్ బి ఊసరవెల్లి లా.. మంచి కథలతో అన్ని జోనర్స్ లో సినిమాలు చేయాలనుకుంటా. అందుకే స్టోరీ విషయంలో చాలా కేర్ తీసుకుంటా.

నా మోస్ట్ స్పెషల్ ఫిలిం

‘గోదావరి’ నాకు మోస్ట్ స్పెషల్ ఫిలిం. అప్పట్లో తాత గారు షిప్ లో ‘అందాల రాముడు’ సినిమా చేసారు. ఆ తర్వాత మావయ్య కూడా ‘రావోయి చందామామ’ సినిమా చేసారు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి బోట్ జర్నీ సినిమా చేయడం చాలా హ్యాపీ. ఇప్పటికీ ఆడియన్స్ ఆ సినిమా గురించి నాతో మాట్లాడుతుంటారు. ఆ సినిమా షూటింగ్ ఎక్స్ పిరీయన్స్ ఎప్పటికీ మర్చిపోలేను.

అనుకోకుండా

వరుసగా డెబ్యూ డైరెక్టర్స్ తో వర్క్ చేయడం హ్యాపీ గానే ఉంది. గౌతం నా దగ్గరికీ వచ్చి ‘మళ్ళీ రావా’ కథ చెప్పినప్పుడు చాలా ముచ్చటేసింది. ఆ సినిమా తర్వాత గౌతంతో మళ్ళీ ఓ సినిమా చేయాలనిపించింది. ఇప్పుడు కూడా అందరూ డెబ్యూ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నా. అనుకోకుండా అందరూ డెబ్యూ డైరెక్టర్స్ అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు చెప్పే కథలు నన్ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మన తెలుగులో చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడిప్పుడే టాలెంటెడ్ డైరెక్టర్స్ ముందుకొస్తున్నారు. తెలుగులో మరిన్ని మంచి సినిమలోస్తాయి.


నా బెస్ట్ క్రిటిక్ తనే

నా సినిమాలకు సంబంధించి సుప్రియానే నా బెస్ట్ క్రిటిక్. తన ఐడియాలజీ సూపర్బ్. రీసెంట్ గా క్రిష్ సినిమాలో నా క్యారెక్టర్ కి సంబంధించి రెండు స్టిల్స్ పంపిస్తే వెంటనే సుప్రియాకి పంపాను. తాత గారి లుక్ లో నన్ను ఫస్ట్ టైం చూసి అవాక్కయ్యింది. రెండిటిలో మొన్న రిలీజ్ చేసిన స్టిల్ సుపర్బ్ అని మెసేజి పెట్టింది. వెంటనే క్రిష్ కి అది ఫార్వర్డ్ చేసి ఇదే సూపర్ సిస్టర్ జడ్జిమెంట్ అని చెప్పా. చాలా విషయాల్లో తన హెల్ప్ తీసుకుంటా.

ఎప్పుడూ రెడీనే..

నచ్చాలి కానీ క్యారెక్టర్ అయినా సపోర్టింగ్ రోల్ అయినా చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉన్నా. హీరోగానే చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఈ మధ్య తారక్ ని కలిసి సినిమాలో ఏదైనా మంచి నెగిటీవ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ ఉంటే చెప్పు విలన్ గా చేస్తా అని అడిగా. నా దగ్గరికి ఇప్పటి వరకూ అలాంటి క్యారెక్టర్స్ రాలేదు. వస్తే మాత్రం కచ్చితంగా వదులుకోను. నాలో రాముడే కాదు రావణాసురుడు కూడా ఉన్నాడు(నవ్వుతూ).

 

త్వరలోనే అనౌన్స్ మెంట్ 

ఇటివలే ఓ డెబ్యూ డైరెక్టర్ ఓ కథ చెప్పాడు. ఎమోషనల్ టచ్ ఉండే సినిమా అది. సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. త్వరలోనే ఆ సినిమా గురించి అన్ని వివరాలతో అనౌన్స్ ఉంటుంది.