సుమంత్ అశ్విన్ - నిహారిక జంటగా 'హ్యాపీ వెడ్డింగ్'

Friday,September 22,2017 - 03:20 by Z_CLU

ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్, నాగ బాబు కుమార్తె నిహారిక జంటగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే టైటిల్ ను  ఖరారు చేసారు మేకర్స్. యు.వి క్రియేషన్స్ సమర్పణలో పాకెట్ సినిమా బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య   దర్శకుడు.

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండడం మరో విశేషం. ‘ఒక మనసు’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోయిన్ నిహారిక తెలుగులో నటిస్తున్న రెండో సినిమా ఇది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజిలో ఉన్న ఈ సినిమా అక్టోబ‌ర్ 4 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్  జరుపుకోనుంది.