Sumanth Ashwin as Producer - నిర్మాతగా మారిన హీరో

Thursday,April 29,2021 - 04:53 by Z_CLU

ఇండస్ట్రీలో ఎవరి వారసుడైనా ఫైనల్ గా హీరో అవ్వాలనుకుంటారు. డైరెక్టర్స్ కొడుకులతో పాటు కొందరు నిర్మాతల కొడుకులు కూడా హీరోగా లాంచ్ అయిన విషయం తెలిసిందే. సుమంత్ అశ్విన్ కూడా నిర్మాత ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోనే. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు తనయుడిగా ‘తూనీగా తూనీగా’ సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు సుమంత్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. కేరింత అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ కుర్ర హీరో నిర్మాతగా మారబోతున్నాడట. ఇటివలే పెళ్లి చేసుకున్న సుమంత్ ‘హనీ ప్రొడక్షన్స్’ అనే బేనర్ పెట్టాడట.

ఈ బేనర్ పై తన తండ్రి డైరెక్ట్ చేయబోతున్న సినిమాను నిర్మించనున్నాడని తెలుస్తుంది. దర్శకుడిగా ఎం.ఎస్.రాజు మూడు సినిమాలు చేశారు. తాజాగా ఆయన డైరెక్షన్ చేసిన ‘డర్టీ హరి’ సినిమా ఓటీటీలో సూపర్ హిట్ అనిపించుకుంది. అందుకే మరో స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఇంకో సినిమా డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారు రాజు. ఆ సినిమాతో నిర్మాతగా తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నాడు సుమంత్ అశ్విన్.

Sumanth-Ashwin-MS-Raju-zeecinemalu

ఇటివలే స్క్రిప్ట్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. 7 డేస్ 6నైట్స్ అనే టైటిల్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో సమర్త్ గొల్లపూడి అనే యువకుడిని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నాడట. యూట్యూబ్ లో అతని మ్యూజిక్ టాలెంట్ చూసి సీనియర్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ రాజు ఫిదా అయ్యి అతనికి ఈ అవకాశం ఇస్తున్నారని తెలుస్తుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics