Sumanth Ashwin - ఓ ఇంటివాడయ్యాడు

Sunday,February 14,2021 - 08:00 by Z_CLU

టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ తో సమానంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. హీరోలంతా వరుసపెట్టి తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకోగా.. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరో చేరిపోయాడు.

టాలీవుడ్ హీరో, నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ పెళ్లి నిన్న గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని ఎమ్మెస్ రాజు ఫామ్ హౌజ్ లో ఈ వివాహ వేడుక సింపుల్ అండ్ స్వీట్ గా జరిగింది. అతి తక్కువ మంది అతిథులు హాజరైన ఈ పెళ్లి వేడుకలో.. దీపిక మెడలో మూడు ముళ్లు వేశాడు సుమంత్ అశ్విన్.

అమెరికాలోని డాలస్ లో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తోంది దీపిక. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం. నిన్న ఉదయం నుంచి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తన పెళ్లి కోసం పెద్దగా గ్యాప్ తీసుకోలేదు హీరో సుమంత్ అశ్విన్. ఇంకా చెప్పాలంటే నిన్న కూడా తన కొత్త సినిమాకు డబ్బింగ్ చెప్పాడు. అతడు నటించిన ‘ఇదే మా కథ’ అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది.