సింప్లీ సూపర్బ్: ఎన్టీఆర్ సినిమా నుంచి ఏఎన్నార్

Thursday,September 20,2018 - 11:57 by Z_CLU

లెజెండ్ ఏఎన్నార్ పాత్రలో ఇప్పటికే కనిపించాడు నాగచైతన్య. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఇప్పుడు సుమంత్ వంతు వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గా నటిస్తున్నాడు సుమంత్. అక్కినేని జయంతి సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఏఎన్నార్ గెటప్ లో ఉన్న సుమంత్ స్టిల్ ను విడుదల చేశారు.

తాత పోలికలు సుమంత్ లో కాస్త ఎక్కువే. ఆ కళ్లు, చిలిపి నవ్వు నాగేశ్వరరావునే గుర్తుచేస్తుంటాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు టోటల్ గా తాతలా మారిపోయాడు. ఈరోజు విడుదలైన సుమంత్ లుక్ ను సడెన్ గా చూస్తే ఎవరైనా ఏఎన్నార్ అనుకుంటారు. ఈ విషయంలో దర్శకుడు క్రిష్ తో పాటు మేకప్ యూనిట్ కు నూటికి నూరు మార్కులు పడాల్సిందే.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఎన్టీఆర్. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. బాలకృష్ణ నిర్మాత. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.