Sukumar-Karthikeya - డిఫరెంట్ కాంబినేషన్

Friday,March 12,2021 - 11:39 by Z_CLU

ప్రస్తుతం కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ తన బేనర్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మరో ప్రాజెక్ట్ ని సెట్ చేయబోతున్నారు.

యంగ్ హీరో కార్తికేయ హీరోగా సుకుమార్ రైటింగ్స్ లో ఓ సినిమా రాబోతుంది. దీనికి సుకుమార్ కథ -మాటలు -స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు.

అయితే ఈ సినిమా ఎలాంటి కథతో తెరకెక్కనుంది..? దర్శకుడెవరు ? లాంటి మిగతా విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను ఓ యంగ్ డైరెక్టర్ డీల్ చేయనున్నాడని తెలుస్తుంది. మరి సుక్కు ఈ ప్రాజెక్ట్ ను తన శిష్యుల్లో ఎవరి చేతుల్లో అయినా పెడతారా ? లేదా తన కాంపౌండ్ లో ఉండే మరో యంగ్ డైరెక్టర్ కి అప్పగిస్తాడా ? చూడాలి.

త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయనున్నారు. నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.