Exclusive - Sukumar Writings పై అన్నీ పుకార్లే

Thursday,June 03,2021 - 05:12 by Z_CLU

తాజాగా ‘సుకుమార్ రైటింగ్స్’ గురించి ఓ వార్త పుట్టుకొచ్చింది. ‘సుకుమార్ రైటింగ్స్’ దర్శకుడు సుకుమార్ సొంత బేనర్ అన్న విషయం తెలిసిందే. మంచి కాన్సెప్ట్ సినిమాలు తీయగలిగే కొత్త దర్శకులకి ఓ అవకాశం ఇవ్వడం కోసం సుక్కు కొన్నేళ్ళ క్రితం ‘సుకుమార్ రైటింగ్స్’ ని స్థాపించాడు. ప్రస్తుతం ఈ బేనర్ లో వరుసగా సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు సుక్క. ఈ బేనర్ కి సంబంధించి ఫైనల్ కాల్ సుకుమార్ దే అయినప్పటికీ ప్రొడక్షన్ పనులన్నీ చూసుకునేది మాత్రం సుకుమార్ సోదరుడు విజయ్ ప్రసాద్ అలాగే సోదరుడి కొడుకు అశోక్. వీరిద్దరే ప్రొడక్షన్ కి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నారు.

sukumar with wife tabitha zeecinemalu 2

అయితే ఇప్పుడు సుకుమార్ తన భార్య తబితా సుకుమార కు తమ బేనర్ భాద్యతను అప్పగించారని ఇకపై ప్రొడక్షన్ కి సంబంధించి వర్క్ మొత్తం ఆమె చూసుకుంటారని ఉన్నట్టుండి ఓ రూమర్ పుట్టుకొచ్చింది. ఈ విషయం గురించి సుక్కు టీంని కాంటాక్ట్ చేస్తే ఈ వార్తలో నిజం లేదని తెలిసింది. సుకుమార్ రైటింగ్స్ కి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ అంతా ఎప్పటిలానే విజయ్ ప్రసాద్ , అశోక్ ఇద్దరూ చూసుకుంటారని చెప్తున్నారు. మరి ఉన్నట్టుండి ప్రొడక్షన్ లోకి సుకుమార్ భార్య పేరు ఎలా వచ్చిందో ? రాసిన వాళ్ళకే తెలియాలి.

sukumar writings

ఇటివలే ‘ఉప్పెన’ సినిమాకు నిర్మాణ భాగస్వామ్యం వహించిన సుకుమార్ రైటింగ్స్ బేనర్ లో మరిన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం సుక్కు సుకుమార్ రైటింగ్స్ బేనర్ పై గీతా ఆర్ట్స్ 2, SVCC సంస్థలతో కలిసి రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. త్వరలోనే మైత్రి మూవీ మేకర్స్ కలిసి మరో సినిమా నిర్మించే ప్లానింగ్ జరుగుతుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics