Vijay Deverakonda - మరో లవ్ స్టోరి?

Wednesday,December 16,2020 - 02:54 by Z_CLU

క్రియేటివ్ జీనియస్ Sukumar నుండి సినిమా అంటే ఏదో కొత్తదనం ఉండకపోదు. తను చెప్పే ప్రతి కథ సరికొత్తగా ఉండేలా చూసుకోవడంలో సుక్కు దిట్ట. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో పుష్ప తీస్తున్న సుకుమార్ నెక్స్ట్ Vijay Deverakonda తో చేయబోయే సినిమాను మాత్రం యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నాడట.

సుక్కు నుండి ఓ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ వచ్చి చాలా ఏళ్లయింది. ‘ఆర్య’, ‘100 % లవ్’ తర్వాత మళ్ళీ ఈ జానర్ లో సినిమా చేయలేదు. అయితే తాజాగా ఆడియన్స్ ఏదైతే ఫీలవుతున్నారో సుక్కు కూడా అదే అనుకుంటున్నాడట. అందుకే మళ్ళీ ఓ సాలిడ్ లవ్ స్టోరీని రెడీ చేసుకొని విజయ్ తో తీయబోతున్నాడట.

అయితే సుక్కు నుండి జస్ట్ లవ్ స్టోరీ మాత్రమే ఊహించలేం. అందులో ఏదో ఒక కొత్త ఇష్యూ, ఇంకాస్ట ట్విస్ట్ తప్పక ఉంటుంది.

మరి సుకుమార్-విజయ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మళ్ళీ మునుపటి సుకుమార్ ను ఆడియన్స్ కి పరిచయం చేసి ఓ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలుస్తుందేమో.

Also Check – దేవరకొండ ప్లానింగ్ ఇది