ఇది ‘రంగస్థలం’ ఇచ్చిన కాన్ఫిడెన్సేనా..?

Thursday,March 07,2019 - 01:03 by Z_CLU

సింపుల్ స్టోరీని డిఫెరెంట్ గా డీల్ చేస్తాడు. అందుకే సుక్కు సినిమాలు అర్థమవ్వాలంటే చాలా IQ ఉండాలంటారు. అయినా సుకుమార్ పంథా సుకుమార్ దే. అలా ఒక స్టైల్ ని నమ్ముకున్నాడు కాబట్టే ‘రంగస్థలం’ ఆ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ సుకుమార్ చేత మరింత డిఫెరెంట్ సినిమా తెరకెక్కేలా చేస్తుందా..?

సుకుమార్ మహేష్ బాబుకు చెప్పిన కథ, బన్ని కి చెప్పిన కథ ఒకటేనా..? అంటే శేషాచలం అడవులు, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనేసరికి న్యాచురల్ గానే మూవీ లవర్స్ లో ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అదే గనక నిజమైతే ఇంకో మాటే లేదు, ఈ సారి కూడా సుక్కు మరో సెన్సేషనల్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈ మధ్య కాలంలో ఏ ఫిల్మ్ మేకర్ ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయలేదు.

 ‘రంగస్థలం’ సినిమా డిస్కర్షన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకవేళ చెర్రీ కూడా రిస్క్ అనుకుని ఉంటే ఆ సినిమా సక్సెస్ కాదు కదా, సెట్స్ పైకి కూడా వచ్చి ఉండేది కాదు. కంటెంట్ సరిగ్గా ఉంటే ఆడియెన్స్ ప్రయోగాలను కూడా అంతే గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంటారు అని నిరూపించిందీ సినిమా. సక్సెస్ ఫుల్ సినిమాకి జస్ట్ గ్లామర్ కాదు, కనెక్ట్ అయ్యే స్థాయిలో ఇమోషన్ ఉన్నా సరిపోతుందని చెప్పకనే చెప్పిందీ రంగస్థలం. చూస్తుంటే ఈ సినిమా సక్సెసే, సుక్కు చేత మరో ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రెడీ చేయిస్తుందనిపిస్తుంది.

ఎగ్జాక్ట్ గా ఏ టైమ్ ఫ్రేమ్ లో సెట్స్ పైకి వస్తుందో ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ, రీసెంట్ గా అనౌన్స్ అయిన బన్ని, సుక్కు సినిమా రంగస్థలం స్థాయిలోనే డిఫెరెంట్ గానే ఉండబోతుదని తెలుస్తుంది. మరి ఆ కథ మహేష్ బాబు రిజెక్ట్ చేసిందేనా..? లేకపోతే బన్ని ఇమేజ్ కి తగ్గటు మరో సినిమా ప్లాన్ చేస్తాడా.. అనేది చూడాలి.