సుకుమార్ , శరత్ మరార్ నిర్మాణంలో నాగ‌శౌర్య కొత్త సినిమా

Sunday,February 03,2019 - 09:50 by Z_CLU

దర్శ‌కుడిగా భారీ చిత్రాల‌ను తెర‌కెక్కిస్తోన్న బ్రిలియంట్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ త‌న నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ఇత‌ర ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి సినిమాల‌ను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ శ‌ర‌త్ మ‌రార్ క‌ల‌యిక‌లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగ‌శౌర్య హీరోగా నటించనున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న కాశీ విశాల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్రకటించనున్నారు.